కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల హక్కులు కాలరాస్తున్నాయని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ అహ్మద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను.. అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలు నిరసనకు దిగారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు దుల్హన్ పథకం కింద రూ.1 లక్ష, విదేశీ విద్యకు 15 లక్షల రూపాయలు, ఇమామ్, మోజన్లకు జీతాలు నేరుగా వారి ఖాతాతో వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలను పూర్తిగా నిలిపివేయడం దుర్మార్గామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భాజపా అధ్యక్షులు సోము వీర్రాజుకు గోవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించేలా మోదీపై ఒత్తిడి చేయాలన్నారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటే ముస్లిం లీగ్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
'వైకాపా, భాజపాలు ముస్లింల హక్కులు కాలరాస్తున్నాయి' - vijayawada dharna chowk agitation news
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టింది. తెదేపా హయాంలో ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను అమలు చేయాలని ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
!['వైకాపా, భాజపాలు ముస్లింల హక్కులు కాలరాస్తున్నాయి' muslim league party protest in dharna chowk vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12630754-644-12630754-1627723922213.jpg)
muslim league party protest in dharna chowk vijayawada