ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లె పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా.. బాలికకు దేవిశ్రీ ఛాన్స్! - telangana it minister ktr

పల్లె పాటకు గుర్తింపు దొరికింది. మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక గొంతు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్​ వద్దకు చేరింది. వర్షం కురిసినప్పుడు మట్టి నుంచి వచ్చే సువాసన వంటి అనుభూతిని పంచిన ఆమె పాటకు రాక్​స్టార్ డీఎస్పీ ఇంప్రెస్ అయ్యారు. త్వరలో తాను ప్రారంభించనున్న 'స్టార్ టు రాక్​స్టార్' కార్యక్రమంలో ఆ బాలికకు అవకాశం ఇస్తానని ట్విటర్ వేదికగా మాటిచ్చారు.

పల్లె పాటకు కేటీఆర్ స్పందన.. బాలికకు డీఎస్పీ ఛాన్స్
పల్లె పాటకు కేటీఆర్ స్పందన.. బాలికకు డీఎస్పీ ఛాన్స్

By

Published : Jun 24, 2021, 7:17 PM IST

స్థానిక ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని కోరిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ స్పందించారు. తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగిలో శార్వాణి అనే బాలిక పాటను.. ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరారు.

వెంటనే స్పందించిన కేటీఆర్.. శార్వాణి వీడియోను సంగీత దర్శకుడు... తమన్, దేవీశ్రీప్రసాద్‌లకు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన దేవీశ్రీప్రసాద్.. మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శార్వాణి చాలా చక్కగా పాడిందని, అలాంటి ప్రతిభావంతులైన గాయకుల కోసమే తాను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తన 'స్టార్ టు రాక్‌స్టార్' కార్యక్రమంలో శార్వాణికి తప్పకుండా అవకాశం ఇస్తానని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details