రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన అధికారులు.. వాటికి విరుద్ధంగా పనిచేస్తున్నారన్నారు. ప్రజల హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలపై పోలీసుల నిర్భందాలు, ప్రభుత్వ వైఖరి, పౌరహక్కుల పరిరక్షణ అనే అంశంపై ఏపీసీఎల్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాఉద్యమాలు చేసే వారిపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సుబ్బారావు ఆరోపించారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది: పౌరహక్కుల సంఘం నేత - ఏపీ పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావు
రాష్ట్రంలో ప్రజల హక్కులు హరించబడుతున్నాయని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన అధికారులు.. వాటికి విరుద్ధంగా పనిచేస్తున్నారన్నారు.
ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని..ప్రజా సమస్యలపై చర్చలు జరపట్లేదని రామకృష్ణ ఆరోపించారు. శాంతిభద్రతల సమస్యల పేరుతో విజయవాడలో ప్రజా సంఘాలను ఎటువంటి కార్యక్రమాలు చేయనివ్వట్లేదని అన్నారు. ప్రెస్ క్లబ్లో సైతం సమావేశాలకు అనుమతించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాతంత్ర హక్కులను కాపాడుకునేందుకు అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మూడు రాజధానులు కావాలంటే ఆ చట్టాన్ని సవరించాలి: లోకేశ్