ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ప్రత్యేక హోదా సాధన సమతి కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్.. అధికారంలోకి వచ్చాక హోదా అంశాన్ని విస్మరించారని మండిపడ్డారు. జులై 4న ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో హోదా విషయమై...సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామన్నారు.
Special Status:'ప్రత్యేక హోదా,విభజన హామీల సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలం' - ప్రత్యేక హోదాపై ముప్పాళ్ల నాగేశ్వరావు
25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్.. అధికారంలోకి వచ్చాక హోదా అంశాన్ని విస్మరించారని ప్రత్యేక హోదా సాధన సమతి కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రత్యేక హోదా,విభజన హామీల సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలం
గుంటూరు వేదికగా జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగిత, రాజధాని అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ సహా అన్ని విభజన హామీలను అమలు చేసేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఇదీ చదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్