ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపోరు: రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం వార్తలు

రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం

By

Published : Mar 8, 2021, 5:07 PM IST

Updated : Mar 8, 2021, 9:27 PM IST

17:05 March 08

ముగిసిన ఎన్నికల ప్రచారం

పురపాలక ఎన్నికల వేళ కొన్ని రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో మార్మోగిన నగరాలు, పట్టణాల్లో ఒక్కసారిగా ప్రశాంతత నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియగా..చివరి నిమిషం వరకూ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం సాగించారు. 12 కార్పొరేషన్లు, 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఏకగ్రీవాలు పోను మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికలు ఆగిపోయాయి. మిగిలిన 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈనెల 10న పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. కార్పొరేషన్లలో 582 డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లోని అన్ని వార్డులు కలిపి మొత్తం 2,215 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికోసం 7 వేల 915 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీటిలో 38 లక్షల 72 వేల 264 మంది పురుష ఓటర్లుండగా..39 లక్షల 97 వేల 840 మహిళా ఓటర్లు ఉన్నారు.  

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించారు. కార్పొరేషన్లలో 26 వేల 835 మంది, మున్సిపాలిటీల్లో 21 వేల 888 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఈ నెల 10 న పోలింగ్ జరగనుండగా..14న ఓట్ల లెక్కింపు జరగనుంది.  

ఇదీచదవండి

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపివేయండి: హైకోర్టు

Last Updated : Mar 8, 2021, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details