విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులకు రూ.2 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాలన అనుమతులు ఇచ్చారు. ఫ్లై ఓవర్ దిగువన 1 నెంబర్ పిల్లర్ నుంచి 47వ పిల్లర్ వరకు సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
రూ.2.75 కోట్లతో బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ - ap municipal department on benz circle flyover
విజయవాడ బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ పనులు చేపట్టాలని పురపాలకశాఖ నిర్ణయించింది. రూ.2 కోట్ల 75 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు సమకూర్చనుంది.
రూ.2.75 కోట్లతో బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ
ఎస్వీఎస్ కల్యాణ మండపం నుంచి గురునానక్ కాలనీ రోడ్డు వరకు ల్యాండ్‌స్కేప్ పనులు, పచ్చదనం పెంపు, ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.
ఇదీ చదవండి :కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు