విజయవాడలో..
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కాస్ విధానంతో మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు గల సంవత్సర కాలంగా అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులకు వర్తించే ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో...
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.