రాష్ట్రంలో విద్య,వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.పురపాలక పాఠశాలల్లో విద్యాప్రమాణాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు....విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి హాజరయ్యారు.మౌలిక సదుపాయాల కల్పన,మెరుగైన బోధన ద్వారా కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మునిసిపల్ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు.ఇందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామన్న మంత్రి.....మాతృభాష,సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.
విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం - విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
విద్య, వైద్య ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్పొరేటు పాఠశాలకు దీటుగా మునిసిపల్ పాఠశాలల ఏర్పాటుచేస్తామన్నారు. మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
muncipal-schools-work-shop-in-vijayawada