ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోరుగా పురపాలక నామినేషన్ల పర్వం

పురపాలక నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. పత్రాలు సరిగా లేవంటూ కొన్నిచోట్ల నామినేషన్లు స్వీకరించకపోవడంపై అభ్యర్థులు ఆవేదన చెందారు.

జోరుగా పురపాలక నామినేషన్ల పర్వం
జోరుగా పురపాలక నామినేషన్ల పర్వం

By

Published : Mar 12, 2020, 11:26 PM IST

జోరుగా పురపాలక నామినేషన్ల పర్వం

పురపోరుకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. జీవీఎంసీ పరిధిలో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. జోన్-2 పరిధిలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైకాపా, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్‌, బీఎస్పీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న విశాఖ నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. వేపగుంట ఆరో జోన్‌లోనూ ఈ కోలాహలం కనిపించింది. యలమంచిలి మున్సిపాలిటీలో జోరుగా నామినేషన్లు పడ్డాయి. వైకాపా, జనసేన అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో.. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అభ్యర్థులు పత్రాలు సమర్పించారు.

విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. వివిధ డివిజన్లలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అవకాశం ఇస్తే విజయవాడ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని... ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. 11వ డివిజన్ నుంచి ఆమె బరిలో నిలిచారు. ఎన్టీఆర్​ కూడలిలోని విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం.... పంటకాలువ రోడ్డు, ఆటోనగర్ మీదుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ర్యాలీలో తెలుగుదేశం ముఖ్యనేతలు సహా శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 15, 16 డివిజన్‌ నుంచి తెలుగుదేశం అభ్యర్థులు ఊరేంగింపు వచ్చి రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. నందిగామ నగరపంచాయతీ కార్యాలయంలోనూ నామినేషన్ల సందడి నెలకొంది.

జంగారెడ్డిగూడెంలో పురపాలక ఎన్నికలకు రెండో రోజూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కర్నూలు నగరపాలక ఎన్నికలకు నామినేషన్లు జోరుగా పడ్డాయి. వైకాపా మేయర్ అభ్యర్థి బీవై. రామయ్య... 19వ వార్డులో నామపత్రం దాఖలు చేశారు.

కడప కార్పొరేషన్ పరిధిలో ప్రక్రియ కోలాహలంగా సాగింది. చాలా మంది అభ్యర్థుల నామపత్రాల్లో తప్పులు దొర్లాయి. అలాంటి వారిని రిటర్నింగ్ అధికారి వెనక్కి పంపించారు. అనంతపురం నగరపాలక పరిధిలో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల వారీగా నామినేషన్లు వేసేలా 13 చోట్ల అధికారులు ఏర్పాట్లు చేశారు. వైకాపా అభ్యర్థి చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తెదేపా అభ్యర్థి లింగారెడ్డి... నవ్వుతూ పలకరించుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో నామపత్రాల పర్వం జోరుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

ఏ-ఫారం.. బీ-ఫారం అంటే ఏంటి సార్?

ABOUT THE AUTHOR

...view details