ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MTF demands to close schools : పాఠశాలలకు సెలవులు ప్రకటించండి: మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్

MTF demands to close schools: పురపాలక పాఠశాలల్లో ఓమిక్రాన్ విలయ తాండవం చేసే అవకాశం ఉందని, మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులు భయాందోళనలతో ఉన్నారని ఎంటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు.

MTF demand to close schools
పురపాలక పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంటిఎఫ్ డిమాండ్...

By

Published : Jan 24, 2022, 10:23 AM IST

Updated : Jan 24, 2022, 11:10 AM IST

MTF demands to close schools: పురపాలక పాఠశాలల్లో ఓమిక్రాన్ విలయ తాండవం చేసే అవకాశం ఉందని, మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులు భయాందోళనలతో ఉన్నారని ఎంటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. రాష్టంలో 2వేల 115 మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో వారం రోజులుగా వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారని స్పష్టం చేశారు. కొన్ని పాఠశాలలో పదుల సంఖ్యలో టీచర్లు, వందల్లో విద్యార్దులు కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సెలవులు ఇవ్వకపోవటం వల్ల వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాద ఉందన్నారు. ప్రతి పాఠశాలలో తరగతికి 60 పై విద్యార్థులు ఉన్న కారణంగా అందరికి కరోనా వాప్తి జరిగే ప్రమాదం ఉందని.... తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఓమిక్రాన్ వైరస్ పట్టణ ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తిగా మారినట్టు ప్రకటించినందున..... సెలవులు ఇవ్వాలని కోరింది. పాఠశాలల్లో రోజూ శానిటేషన్ కోసం సంబధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

కరోనా కేసులు వచ్చిన స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

Last Updated : Jan 24, 2022, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details