ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏడాదిలో రఘురామ కృష్ణంరాజు, గల్లా జయదేవ్​ టాప్​... ​ - ఎంపీల పనితీరుపై యువగళం నివేదిక

లోక్‌సభలో నవ్యాంధ్ర వాణి వినిపించాల్సింది 25 మంది... అందులో వైకాపా సభ్యులు 22, తెదేపా సభ్యులు ముగ్గురు. వీరిలో ఎవరెవరు ఎన్నిరోజులు సభకు వెళ్లారు. ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు, ప్రశ్నలు వేశారు.? అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలేమైనా లేవనెత్తారా? నవ్యాంధ్ర వాణి వినిపించారా?. పనితీరులో ప్రథమం ఎవరు, అథమం ఎవరు..? ఇలాంటి ఆసక్తికర అంశాలపైనే యువగళం అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.

mps progress report on synergy is given by yuvagalam
రాష్ట్ర ఎంపీల పనితీరుపై రాష్ట్ర యువగళం నివేదిక

By

Published : Jun 5, 2020, 7:00 AM IST

Updated : Jun 5, 2020, 12:02 PM IST

గడచిన ఏడాది కాలంలో లోక్‌సభలో ఎంపీల పనీతీరుపై యువగళం అనే సంస్థ అధ్యయనం చేసింది. అంశాలవారీగా ఒక్కక్కరి పని తీరును విశ్లేషించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. మొత్తంగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు... యువగళం ప్రథమ స్థానం ఇచ్చింది.

  • 97 శాతం సభకు హాజరైన రఘురామకృష్ణంరాజు... 91 ప్రశ్నల అడిగి 42 చర్చల్లో పాల్గొన్నారు.
  • రెండో స్థానంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిలిచారు. ఈయన 93 శాతం హాజరై 91 ప్రశ్నలు అడిగారు. 36 చర్చల్లో పాల్గొన్నారు.
  • తృతీయ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత నిలిచారు. 88 శాతం హాజరుతో వంద ప్రశ్నలు అడిగారు. 33 చర్చల్లో పాల్గొన్నారు.
  • నాలుగో స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలిచారు. 93 శాతం హాజరుతో 69 ప్రశ్నలు అడిగారు. 34 చర్చల్లో పాల్గొన్నారు.
  • ఐదో స్థానంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నిలవగా... 89 శాతం హాజరై 52 ప్రశ్నలు సంధించారు. 21 చర్చల్లో పాల్గొన్నారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ యువగళం సర్వేలో ఆఖరి స్థానంలో.... నిలిచారు. 50 శాతం హాజరుతో ఒక్క ప్రశ్నా కూడా అడగని సురేష్‌ ఒక చర్చలోనే పాల్గొన్నట్లు తెలిపింది.

  • చివరి నుంచి రెండో స్థానంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిలిచారు. 76 శాతం హాజరుతో 14 ప్రశ్నలు అడిగిన ఆయన.. ఒక చర్చలో పాల్గొన్నారు.
  • చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ 75 శాతం హాజరుతో 35 ప్రశ్నలు వేశారు. ఒక చర్చలో మాత్రమే పాల్గొన్నారు.
  • చివరి నుంచి నాలుగో స్థానంలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి నిలిచారు. 86 శాతం హాజరుతో పది ప్రశ్నలు వేశారు. ఆరు చర్చల్లో పాల్గొన్నారు.
  • చివరి నుంచి ఐదో స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈయన 82 శాతం హాజరుతో 46 ప్రశ్నలు వేశారు. రెండు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు.

పార్లమెంట్​లో ఒక్క ప్రశ్న కూడా వేయని ఎంపీలుగా బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నందిగం సురేష్, అరకు ఎంపీ జి.మాధవి ఉన్నారు. 50 శాతం అంతకంటే తక్కువ హాజరు ఉన్న ఎంపీలుగా అవినాష్ రెడ్డి, సురేష్ నిలిచారు. పార్లమెంట్​లో ఒకే ఒక్క చర్చలో పాల్గొన్న ఎంపీలుగా సంజీవ్ కుమార్, ఎంవీవీ సత్యనారాయణ, నందిగామ సురేష్, వైఎస్అవినాష్ రెడ్డి ఉన్నారు. జాతీయ సగటులో వైకాపా- తెదేపా సభ్యుల ప్రదర్శనపైనా ఆసక్తికరమైన అంశాలను యువగళం వెల్లడించింది.

అన్ని రాజకీయ పార్టీల యువ ప్రతినిధుల భాగస్వామ్యంతో... యువగళం ఓ సంస్థగా రూపాంతరం చెందింది. ఏటా ఇదే తరహాలో ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది.

ఇదీ చదవండి:

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్​

Last Updated : Jun 5, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details