"సచివాలయ ఉద్యోగులుగా మాకు అవకాశమివ్వండి"
సచివాలయాల ఉద్యోగాలకు తమను నేరుగా తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీఈవోలు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాతపరీక్షలు లేకుండా తమను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వ్యవసాయ విస్తరణాధికారులు (ఎంపీఈవో)లను గ్రామ సచివాలయాల్లోకి నేరుగా తీసుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో చేపట్టిన విజ్ఞాపన, రిలే దీక్షలు నిన్నటితో తొమ్మిదో రోజుకు చేరాయి. జిల్లా నియామక కమిటీ ద్వారా ఎంపికై ప్రభుత్వ పథకాలను రైతులకు దగ్గర చేస్తున్న ఎంపీఈవోలను గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లోకి నేరుగా తీసుకోవాలని వారు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.