ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP VIJAYA SAI: సవరించిన పోలవరం అంచనాలను.. వెంటనే ఆమోదించండి: ఎంపీ విజయసాయిరెడ్డి - rajasabha updates

MP Vijaya sai reddy: రాజ్యసభలో ఆనకట్టల భద్రతా బిల్లుపై జరిగిన చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సవరించిన పోలవరం అంచనాలను వెంటనే ఆమోదించాలని కోరారు.

ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Dec 2, 2021, 7:36 PM IST

MP Vijaya sai reddy in rajya sabha: రాజ్యసభలో ఆనకట్టల భద్రతా బిల్లుపై జరిగిన చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవరించిన పోలవరం అంచనాల విషయమై ఆయన మాట్లాడారు. సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

సవరించిన అంచనా వ్యయానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందన్న విజయసాయిరెడ్డి.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కమిటీ ఆమోదం తెలిపినా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే ఆమోదం తెలిపి, నిధులు విడుదల చేయాలని విజయసాయి రెడ్డి కోరారు.

ఇదీ చదవండి:

పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

ABOUT THE AUTHOR

...view details