ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రింగ్​ వలల మత్స్యవేటకు ప్రభుత్వం వ్యతిరేకం: ఎంపీ విజయసాయి - విజయసాయి న్యూస్

విశాఖ పెద్ద జాలరిపేట మత్స్యకార ప్రాంతాల్లో వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు. సముద్రంలో రింగ్​ వలల మత్స్యవేటకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

రింగ్​ వలల మత్స్యవేటకు ప్రభుత్వం వ్యతిరేకం
రింగ్​ వలల మత్స్యవేటకు ప్రభుత్వం వ్యతిరేకం

By

Published : Feb 25, 2021, 9:32 PM IST

సముద్రంలో రింగ్​ వలల మత్స్యవేటకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖ పెద్ద జాలరిపేట మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించిన ఆయన..సంప్రదాయ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రింగ్ వలలతో వేట కోసం గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొద్దిమంది మత్స్యకారులు.. సముద్రంలోని ఎనిమిది నాటికల్ మైళ్ల అవతల వేట చేసుకోవాలని ఈ అంశంపై వేసిన కమిటీ సూచించిందని తెలిపారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసిందన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details