అయోధ్య రామమందిర నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి కుటుంబం తరపున 2 కోట్ల 2 లక్షల 32 వేలు విరాళంగా ప్రకటించారు. విరాళాల సేకరణలో భాగంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో సుజనా పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణంలో భాగస్వాములం కావటం గర్వకారణమన్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంపీ సుజనా భారీ విరాళం - అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంపీ సుజనా భారీ విరాళం తాజా వార్తలు
అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కుటుంబం రామమందిర నిర్మాణానికి 2.2 కోట్లు విరాళంగా ప్రకటించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంపీ సుజనా భారీ విరాళం
మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5 లక్షలు, సీసీఎల్ గ్రూప్ రూ.6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ.15 లక్షల విరాళాన్ని ఇచ్చారు.