ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP Sujana Chowdary fire on YSRCP: వైకాపా అరాచకాలకు ఆ ఘటనలే నిదర్శనం: ఎంపీ సుజనా - సీఎం జగన్​పై ఎంపీ సుజనాచౌదరి ఫైర్

MP Sujana Chowdary Comments on CM jagan: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లతో బెదిరింపులు, కబ్జాలకు పాల్పడటం రివాజుగా మారిందని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఘటనలే.. వైకాపా ఆరాచకాలకు నిదర్శనం అన్నారు.

ఎంపీ సుజనాచౌదరి
MP Sujana Chowdary Comments on CM jagan

By

Published : Dec 21, 2021, 11:46 AM IST

MP Sujana Chowdary Fire On YSRCP: విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా.. ఘటనలు ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న అరాచకాలకు పరాకాష్ట అని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో బెదిరించడం, కబ్జాలకు పాల్పడటం పరిపాటుగా మారిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్​.. తక్షణం ఈ తరహా ఆరాచకాలను అరికట్టాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.

ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటా..

వైకాపా నేతల వేధింపులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని బాధితులకు సుజనాచౌదరి సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపిస్తే ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. ఫిర్యాదులను saveandhrapradesh2022@gmail.com కి పంపాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

SNAKE IN MP HOUSE: ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాసంలో రక్తపింజర కలకలం

ABOUT THE AUTHOR

...view details