కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని రూ.10 లక్షలు నుంచి రూ.25లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు.
పథకం లబ్ధిదారులకు రుజువుగా కొవిడ్ పాజిటివ్ టెస్టుతో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని అంగీకరించాలని కోరారు. తక్షణ ఉపశమనంగా పిల్లలకు రూ.3 లక్షలు చెల్లించాలన్నారు. గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు.