ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు త్వరగా ప్రారంభించాలి' - దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ తాజా వార్తలు

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని... తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో కోరారు. దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న వాల్తేరు డివిజన్‌ మూసివేతను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలి
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలి

By

Published : Sep 21, 2020, 6:06 PM IST

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం..విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును కేంద్రం ప్రకటించిందని తెదేపా ఎంపీ రామ్మోహన్​ నాయుడు స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు ఇటీవల బడ్జెట్‌లోనూ రూ. 170 కోట్లు కేటాయించారని లోక్​సభలో తెలిపారు. ఆ పనులు ఎప్పడు ప్రారంభమవుతాయో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. జోన్‌ సరిహద్దులపైనా భేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలి

దేశంలోనే అత్యధిక లాభాలు తీసుకురావడమే కాక...చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వాల్తేరు డివిజన్‌ మూసివేతను వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఖుర్దా రోడ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న పలాస, మందస, సుమ్మాదేవి, ఇచ్ఛాపురం, బారువా, జాడుపూడి, సోంపేట స్టేషన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కలపాలన్నారు. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వేజోన్‌ కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఆ పనులు వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

ABOUT THE AUTHOR

...view details