కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైరస్ కట్టడి గురించి ఆలోచించాల్సిన సీఎం జగన్..... ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయటంపై దృష్టి సారించడం శోచనీయమని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు(Mp Rammohan) మండిపడ్డారు. మహానాడులో 'కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు - తలకిందులైన కుటుంబ ఆదాయం' అంశంపై తొలి తీర్మానాన్ని రామ్మోహన్ నాయుడు బలపరిచారు. అందరికీ వ్యాక్సిన్ అందిచటంతో పాటు బ్లాక్ ఫంగస్ నివారణకు సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
Mp Rammohan: కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: ఎంపీ రామ్మోహన్ - tdp mahanadu
వైకాపా ప్రభుత్వ తీరుపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్(Mp Rammohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్