కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ల నిధికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విరాళం ప్రకటించారు. కరోనాను ఎదుర్కొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్యులకు 50 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించటంలో తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి వైద్యం అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వైద్యుల ఆరోగ్యపరిరక్షణకు అవసరమైన మాస్కులు, పీపీఈల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ల సహాయ నిధికి ఎంపీ రామ్మోహన్ నాయుడు విరాళం - ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజా వార్తలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొవటంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. డాక్టర్ల సహాయనిధికి ఆయన 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు విరాళం