ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కావాలనే రథం దగ్ధం చేసినట్టుంది: ఆర్​ఆర్​ఆర్​ - ఎంపీ రఘురామకృష్ణరాజు న్యూస్

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రథం దగ్ధం.. హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.

కావాలనే రథం దగ్ధం చేసినట్టుంది:ఆర్​ఆర్​ఆర్​
కావాలనే రథం దగ్ధం చేసినట్టుంది:ఆర్​ఆర్​ఆర్​

By

Published : Sep 7, 2020, 3:22 PM IST

అంతర్వేదిలో కావాలనే రథం దగ్ధం చేసినట్లుగా కనిపిస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రథం తగలబెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

హిందూ ఆలయాల విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏపీలో తక్కువ నాణ్యత గల మద్యాన్ని నిషేధించాలి. పక్క రాష్ట్రాల ఆదాయం పెరిగే చర్యలు ఆపాలి.

- రఘురామకృష్ణరాజు, ఎంపీ

ఇదీ చదవండి:క్రిమిసంహారక టన్నెల్స్​పై కేంద్రం నిషేధం!

ABOUT THE AUTHOR

...view details