ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ragurama letter to CM Jagan: 'పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి' - house construction for poor people in andhrapradhesh

పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ హామీ వల్లే ప్రజల్లో వైకాపాకు మద్దతు లభించిందని తెలిపారు.

Ragurama letter to CM Jagan: 'పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి'
Ragurama letter to CM Jagan: 'పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి'Ragurama letter to CM Jagan: 'పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి'

By

Published : Jun 17, 2021, 7:56 AM IST

ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు 8వ లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలు, పేదలందరికి ఇళ్లు అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. పేదలందరికి ఇళ్లు ఇస్తామన్న హామీతో ప్రజల నుంచి వైకాపాకు మద్దతు లభించిందించన్న రఘురామ... అర్హులైన వారందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.

పీఎంఏవై కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చుచేస్తామని వైకాపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. జగనన్న కాలనీల్లో ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details