ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాంట్రాక్టర్లూ కోర్టుకు వెళ్లండి.. అప్పుడే న్యాయం: ఆర్​ఆర్​ఆర్​ - జగన్​పై రఘురామకృష్ణరాజు కామెంట్స్

కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడితే.. వారూ కోర్టుకెళ్తారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎంతోమంది తనకు ఫోన్ చేస్తున్నారని... బిల్లు చెల్లింపులు జరగట్లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్​ రాజధాని మార్పుపై కాకుండా కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మూడు రాజధానులు కాదని.. విశాఖ ఒకదానినే రాజధానిగా చేయాలని చూస్తున్నారని.. అభిప్రాయపడ్డారు.

mp-raghuramakrishnaraju-comments-on-jagan-over-3-capital
mp-raghuramakrishnaraju-comments-on-jagan-over-3-capital

By

Published : Aug 31, 2020, 6:51 PM IST

Updated : Aug 31, 2020, 7:57 PM IST

కాంట్రాక్టర్ల జీవితాల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గ్రామాల్లో వసతుల కల్పనకు.. మార్జిన్ లేకపోయినా.. పనులు చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు 20 వేల నుంచి 25 వేల కోట్ల వరకు బకాయిలు పడ్డామని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్రిబుల్ ఆర్​ కొనసాగుతుందని.. అమరావతి కోసం రైతులు రణం చేస్తున్నారని, జీతాల కోసం రుణం తీసుకుంటున్నారని, ఎస్సీలపై రావణుడిలా దాడులు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు అభివర్ణించారు.

బంధు ప్రీతి కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. విలువలు మన మాటల వరకే ఉన్నాయి. పనుల్లో కూడా ఉండాలి. ప్రత్యేకించి ఒకే సామాజికవర్గం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించట్లేదు. తప్పు జరుగుతుంది అనే మాట నిజం. ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. అధికారులు కాంట్రాక్టర్ల కష్టాలు ముఖ్యమంత్రి దగ్గరకు ఎందుకు తీసుకుపోవడం లేదు? ప్రభుత్వం నుంచి నిధులు రాని కాంట్రాక్టర్లూ.. వీలైతే కోర్టుకు వెళ్ళండి. అప్పుడే న్యాయం జరుగుతుంది.

-రఘురామకృష్ణరాజు, ఎంపీ

ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష వరకు ఉన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ పెద్దలకు వైరస్ సోకితే హైదరాబాద్ వెళ్తున్న తీరు కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు సరైన ఆహారం అందని పరిస్థితి కనిపిస్తోందన్నారు.

'ముఖ్యమంత్రి జగన్ రాజధాని గురించి కాకుండా కరోనా కట్టడి అంశంపై దృష్టి పెట్టాలి. కేసు ఎలాగూ న్యాయస్థానంలో ఉంది. మూడు రాజధానులు అనేది ఒక భ్రమ. ఒకే రాజధాని. దానిని విశాఖపట్నం తీసుకెళ్లాలి అని చూస్తున్నారు. రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు రాజధాని మార్పు అంటే కుదరదు. మన ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం చేయకూడదు. అమరావతినే రాజధానిగా చేసుకుందాం.' అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

--

ఇదీ చదవండి:

ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జ్

Last Updated : Aug 31, 2020, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details