ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం చాలా దారుణం: రఘురామకృష్ణరాజు - రేణిగుంటలో చంద్రబాబు అరెస్టు వార్తలు

ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం చాలా దారుణమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రతిపక్ష నేతను ప్రచారానికి కూడా వెళ్లనివ్వరా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్షనేతను అడ్డుకోవడం చాలా దారుణం: రఘురామకృష్ణరాజు
ప్రతిపక్షనేతను అడ్డుకోవడం చాలా దారుణం: రఘురామకృష్ణరాజు

By

Published : Mar 1, 2021, 3:41 PM IST

పురపాలిక ఎన్నికలంటే వైకాపాకు ఎందుకంత భయమని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. 'నా నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు. నాపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని కోరా.' అన్ని కేసులపై కలిపి క్వాష్ పిటిషన్ వేస్తా. నాపై జరిగే కుట్రలో తాడేపల్లివారు ఉన్నారని అనుమానం ఉంది.' అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

తప్పుడు కేసులు పెట్టిన వారిపై స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇస్తాను. కులం తరఫున మాట్లాడిన ఏయూ వీసీని గవర్నర్‌ తొలగించాలి. ఎంపీగా నాకుండే హక్కులు కాలరాసేందుకు తితిదే ఛైర్మన్ ఎవరు..? నాపై దాడులు, కుట్రను ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details