ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ రఘురామ ఒంటిపై దెబ్బలు-పోలీసులు కొట్టినట్లు తేలితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హైకోర్టు

పోలీసులు నన్ను కొట్టారు: రఘురామ ఫిర్యాదు
పోలీసులు నన్ను కొట్టారు: రఘురామ ఫిర్యాదు

By

Published : May 15, 2021, 7:15 PM IST

Updated : May 15, 2021, 10:59 PM IST

22:52 May 15

19:13 May 15

సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కాళ్లకు దెబ్బలు కనిపిస్తుండటం..సంచలనంగా మారింది.పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.ఈ పరిణామాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.ఎంపీకి తాజాగా గాయాలైనట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది

సీఐడీ పోలీసులు కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు గాయాలయ్యాయి.ఆయన కాళ్లు కమిలిపోయి..గాయాలు కనిపిస్తున్నాయి.పోలీసులే తనను కొట్టారంటూ..ఎంపీ స్వయంగా సెషెన్స్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.ఆయనకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు.సమాజంలో కులాల మధ్య ద్వేషాలు కలిగేలా వ్యాఖ్యలు చేయడం,ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై సీఐడీ పోలీసులు ఆయనను హైదరాబాద్​లోని తన నివాసంలో శుక్రవారం అరెస్టు చేశారు

శుక్రవారం ఎంపీ రఘురామ జన్మదినం కావడంతో ఆయన కుటుంబసభ్యులతోనే ఉన్నారు.ఆ సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలించారు.విజయవాడ సమీపంలోని సీఐడీ కార్యాలయంలో రాత్రంతా ఉంచారు.ఇవాళ మధ్యాహ్నం తర్వాత సెషెన్సు కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు పోలీసులపై ఫిర్యాదు చేశారు.కస్టడీలో తనను గాయపరిచారని చెప్పారు.ఈ కారణంగా రఘురామకృష్ణరాజు రిమాండ్​ను పెండింగ్​లో ఉంచిన న్యాయమూర్తి.. ఆయనకు చికిత్స అందించాలని పోలీసులను ఆదేశించారు.ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు ఎంపీ నిరాకరించడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్​మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

హైకోర్టు హెచ్చరిక

కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టారంటూ..ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.ఎంపీ కాళ్లకు గాయాలయ్యాయని ..పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆధారాలు సమర్పించారు.ఈ విషయాన్ని లోక్​సభ స్పీకర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది.కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొట్టారని నిలదీసిన ఉన్నత న్యాయస్థానం.. రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రఘురామ కేసు విచారణకు హైకోర్టు స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది.

ఇదీ చదవండి:కింది కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన

Last Updated : May 15, 2021, 10:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details