MP Raghurama: ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి.. ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ - ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలన్న ఎంపీ రఘురామ
13:18 April 04
కోర్టు తీర్పును తప్పుపడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఫిర్యాదు
MP Raghurama letter to PM Modi:హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుబట్టిందని.. ప్రధానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించి.. రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫారసు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయవ్యవస్థపై అధికారపక్షం దాడికి ఇదే నిదర్శనం. అమరావతి నిర్మాణానికి 60 నెలల సమయం కావాలన్నారు. 150 కేసులకు పైగా కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోర్టు ధిక్కరణ కేసులు కూడా అంతకుమించి పెరిగిపోయాయి. కోర్టు ధిక్కరణపై 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడాన్ని కాగ్ తప్పు పట్టింది. -రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇదీ చదవండి: