ఏపీ మండలి రద్దు ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఎంపీ రఘురామ కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులకు రఘురామ లేఖ రాశారు. 2020 జనవరి 27న అసెంబ్లీలో మండలి రద్దుకు తీర్మానం చేశారని తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకొని వర్షాకాల సమావేశాల్లో తీర్మానం పెట్టాలని.. సంబంధిత కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి లేఖలో విజ్ఞప్తి చేశారు.
MP Raghurama: కేంద్ర మంత్రులకు ఎంపీ రఘురామ లేఖ - ఏపీ మండలి రద్దు ప్రక్రియ వెంటనే చేపట్టాలి
ఏపీ మండలి రద్దు తీర్మానంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ.. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులకు ఎంపీ రఘురామ లేఖ రాశారు.
కేంద్ర మంత్రులకు ఎంపీ రఘురామ లేఖ