ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR letter to Modi: ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ.. ఎందుకంటే..! - మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

RRR letter to Modi: ప్రధాని మోదీకి.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో అమ్మే మద్యంలో.. విషపదార్థాలు ఉన్నట్లు నివేదికలతో ఫిర్యాదు చేశారు. మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు తేలిన ల్యాబ్‌ నివేదికలను... లేఖకు జత చేసినట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

mp raghurama krishnaraju letter to PM Modi
ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ

By

Published : Feb 2, 2022, 4:09 PM IST

Updated : Feb 3, 2022, 5:01 AM IST

RRR letter to Modi: రాష్ట్ర ప్రభుత్వం అమ్మే మద్యంలో విషపూరిత రసాయనాలున్నాయని... వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు తేలిన ల్యాబ్‌ నివేదికలను... లేఖకు జత చేసినట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మద్యంలో రసాయనాల వ్యవహారంపై రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తనకు లేఖ రాసినట్లు మీడియాలోనే చూసినట్లు పేర్కొన్నారు.

వైకాపాకు 151 సీట్లు ఉండటంతో.. ఏదైనా చేయగలనని అనుకుంటున్నారు. కోర్టులంటే గౌరవం లేదు.. ప్రజల హక్కులంటే గౌరవం లేదు. -రఘురామకృష్ణరాజు, ఎంపీ

Last Updated : Feb 3, 2022, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details