ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: రూ.18 వేలతో ఏడాది పాటు విద్య సాధ్యమేనా ?

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై ఎంపీ రఘురామ విమర్శలు చేశారు. రూ.18 వేలతో కళాశాల విద్యార్థికి ఏడాదిపాటు విద్యతో పాటు హాస్టలు సౌకర్యం కల్పించగలరా? అని నిలదీశారు.

mp Raghurama
ఎంపీ రఘురామ

By

Published : Aug 25, 2021, 3:52 PM IST

రూ.18 వేలతో ఏడాది పాటు విద్య సాధ్యమేనా ?

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజులు భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించడం మంచిదే అయినా...ఈ రకమైన ఫీజులతో పాఠశాలలు, కళాశాల నిర్వహణ సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. రూ.18 వేలతో కళాశాల విద్యార్థికి ఏడాదిపాటు విద్యతో పాటు హాస్టలు సౌకర్యం కల్పించగలరా? అని నిలదీశారు. ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ఇదీ చదవండి

Jagan Bail cancel petition: జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా

ABOUT THE AUTHOR

...view details