MP Raghurama: ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు అనే విధానం మన దేశంలో కుదరదని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎవరూ పోటీ చేయకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చని.. శాశ్వత, జీవితకాల అధ్యక్షుడు అంటే కుదరదని స్పష్టం చేశారు. విజయమ్మ శుక్రవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
YS Vijayamma Resignation: వైకాపా ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.