MP RAGHURAMA: వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తే వైకాపా కచ్చితంగా ఓడిపోతుందని, అందులో అనుమానం లేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆయన శనివారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఓడించాలని చూడటం సహజం.. అందుకే ప్రతిపక్షాల ఓట్లను చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ చెప్పారు. చంద్రబాబు సభలకు సహజంగానే ప్రజలు దండిగా వచ్చారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను.. ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం అని ఆయనా చెప్పారు. ఆ వ్యాఖ్యలను చూసి మా పార్టీ (వైకాపా) ఎందుకు భయపడుతోందో నాకైతే అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లేస్తారు. లేదంటే లేదు...’ అని రఘురామ వ్యాఖ్యానించారు.
MP RAGHURAMA: 'తెదేపా-జనసేన కలిసి పోటీ చేస్తే వైకాపా ఓటమే': రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకృష్ణరాజు
MP RAGHURAMA: వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తే వైకాపా కచ్చితంగా ఓడిపోతుందని, అందులో అనుమానం లేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లేస్తారు.. లేదంటే లేదు...’ అని రఘురామ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తే వైకాపా కచ్చితంగా ఓడిపోతుంది