అమర రాజా పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్ కక్షసాధింపు చర్యలు ఆపాలని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. కాలుష్యం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అలాగైతే.. ఫార్మా కంపెనీల సంగతేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై కోర్టులో పిటిషన్ వేస్తానని హెచ్చరించారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి విజయకుమార్ రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై.. కేంద్ర అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు.