సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సోమవారం ఇంటికి చేరే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ఆయనకు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసినా.. ఇప్పటికీ సంబంధిత పత్రాలు న్యాయవాదులకు అందని కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోంది.
ఇవాళే.. రఘురామ విడుదలవుతారని అంతా అనుకున్నా.. ప్రక్రియలో ఆలస్యంతో సోమవారం విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ తరపు న్యాయవాదులు కింది కోర్టులో సోమవారం పూచీకత్తును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.