ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కరెంటు కోతలు అందుకే : రఘురామ - సీఎం జగన్​ పర్యటనపై ఎంపీ రఘురామ కామెంట్స్​

MP RRR on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ఆర్థిక అరాచకాలు, అప్పుల తప్పులే జగన్‌ను దిల్లీకి రప్పించాయని పేర్కొన్నారు. కరెంట్​ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని..​ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

mp rrr
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Apr 8, 2022, 6:57 PM IST

రాష్ట్రంలో విద్యుత్​ ఛార్జీల పెంపుపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. 'విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వల్ల బిల్లులు ఎక్కువస్తాయి. బిల్లులు తగ్గించాలంటే ఏం చేయాలి.. అందుకే విద్యుత్‌ కోతలు మొదలుపెట్టారు' అని ముఖ్యమంత్రి జగన్​పై రఘురామ మండిపడ్డారు. కరెంట్​ బిల్లులను అమాంతం పెంచి ప్రజలపై భారం వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని రఘురామ డిమాండ్‌ చేశారు. జగన్​ దిల్లీ పర్యటనపై కామెంట్స్ చేసిన రఘురామ.. జగన్‌ను ఎందుకు పిలిచారో తనకు తెలుసునన్నారు. జగన్‌ సమయం అడిగితే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. వైకాపా చేసిన ఆర్థిక అరాచకాలు, అప్పుల తప్పుల నేపథ్యంలో జగన్‌ను దిల్లీకి పిలిచారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details