ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: 3 రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు

mp raghu rama krishnam raju
3 రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ

By

Published : Jul 18, 2021, 3:11 PM IST

Updated : Jul 19, 2021, 2:14 AM IST

15:07 July 18

3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంట్‌లోనే చట్టాన్ని సవరించాలి

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు రాజధానులుగా మార్చే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంటుకే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రాజధాని మార్పు, రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై కేంద్రమంత్రికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కేంద్రమే ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, వసతుల కల్పనకు కేంద్రం సాయం చేసిందని, మెుత్తంగా అమరావతిలో రూ. 50వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని అన్నారు.

 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, భవిష్యత్తులో అది మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న మెజారిటీతో కేంద్ర చట్టాన్ని మార్చగలనని అనుకుంటోందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతి రాష్ట్రం కేంద్ర చట్టాలను ఉల్లంఘించి తమ సొంత చట్టాలు చేసుకుంటాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చోరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నారని ఆయన తెలిపారు.

 రాజధానుల మార్పుపై హైకోర్టు  యథాతథస్థితి ఆదేశాలు జారీ చేసిందని, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని అయినా మూడు రాజధానులపై రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. సమాఖ్య సూత్రాలకు లోబడి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, పునర్విభజన చట్టానికి సవరణలు చేసేవరకు ఎలాంటి కదలిక లేకుండా చూడాలని కోరారు.

ఇదీ చదవండి:

 టీ కొట్టు యజమానిపై మంత్రి వెల్లంపల్లి అనుచరుల వీరంగం

Last Updated : Jul 19, 2021, 2:14 AM IST

ABOUT THE AUTHOR

...view details