విజయవాడ బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లై ఓవర్ ను ఎంపీ కేశినేని, గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ పైవంతెన ద్వారా.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతోందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని కేశినేని ఆనందం వ్యక్తం చేశారు.
Benz circle fly over: దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం - ఎంపీ కేశినేని - mp kesineni nani on benz circle fly over
విజయవాడ బెంజ్ సర్కిల్ లోని కొత్త ఫ్లై ఓవర్ ను ఎంపీ కేశినేని పరిశీలించారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతోనే 2 పైవంతెనలు వచ్చాయని కేశినేని అన్నారు.
విజయవాడకు ఏది అడిగినా గడ్కరీ కాదనకుండా చేశారని అన్నారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతోనే 2 పైవంతెనలు వచ్చాయని కేశినేని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి ముందే హైవే అభివృద్ధి అధికారులు పూర్తిచేశారని వ్యాఖ్యానించారు. రెండు పైవంతెనలతో పాటు సర్వీస్ రోడ్డు అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు వచ్చాయన్నారు. కేంద్రం నిధులు కేటాయించేలా తెదేపా ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు.
'సర్వీసు రోడ్డు సమస్య పరిష్కారానికి మావంతు కృషి చేశాం.రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు రోడ్డు అభివృద్ధికి స్థలం ఇవ్వలేదు. ఎంపీ కేశినేని, నేను సర్వీస్ రోడ్డు అభివృద్ధి జరిగేలా బాధ్యత తీసుకున్నాం. రెండు దశాబ్దాల ట్రాఫిక్ సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది.'- గద్దె రామ్మోహన్