విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జగన్కు చేతకాకపోతే తాను చేసి చూపిస్తానని తెదేపా ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. అప్పుడు జగన్ నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చునని దుయ్యబట్టారు. బెంజిసర్కిల్ ఫ్లైవర్ ఓవర్ జాప్యంపై ట్విట్టర్లో కేశినేని నాని విమర్శించారు. కేంద్రం నుంచి 1250 కోట్ల రూపాయల నిధుల రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. "ఈనాడు"లో వచ్చిన కథనాన్ని ఉదహరిస్తూ... ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని జగన్... ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలకు ఏ రకంగా పరిష్కారం చూపిస్తారని నిలదీశారు.
'ఫ్లైఓవర్ నిర్మాణం నువ్వు పూర్తి చేయకపోతే.. నేను చేస్తా' - kesineni nani
విజయవాడ బెంజిసర్కిల్ ప్లైఓవర్ నిర్మాణం జగన్ పూర్తి చేయలేకపోతే... తాను చేసి చూపిస్తానని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సీఎంకు సవాల్ విసిరారు
ఎంపీ కేశినేని నాని
Last Updated : Jul 31, 2019, 9:42 AM IST