ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించేదే తెదేపా: కేశినేని నాని - groceries distribute to municipal workers at vijayawada

ప్రజలు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ భరోసా కల్పించేదే తెలుగుదేశం పార్టీ అని ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 డివిజన్​లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

groceries distribute to municipal workers
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవస సరకులు పంపిణీ

By

Published : Jun 19, 2021, 5:15 PM IST

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. అధికార పార్టీని గెలిపిస్తే పన్నుల భారం పెంచుతూ పోతుందని చెప్పినా ప్రజలు వినలేదని.. ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వైకాపా తుంగలోకి తొక్కిందని కేశినేని నాని దయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 డివిజన్​లో పారిశుద్ధ్య కార్మికులకు నాని, డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కరోనా కష్టకాలంలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్ధితిలో లేదని.. పెరుగుతున్న పన్నులు, నిత్యావసర ధరలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ప్రజలు కష్టాకాలంలో ఉంటే మేమున్నామంటూ భరోసా కల్పించేదే తెలుగుదేశం పార్టీ అని కేశినేని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details