ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kesineni: ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 3 రాజధానుల నాటకం: ఎంపీ కేశినేని నాని - మూడు రాజధానులపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

MP Kesineni Nani: ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సీఎం జగన్​... మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. సుప్రీంకోర్టులో జగన్‌కు భంగపాటు తప్పదన్నారు.

MP Keshineni Nani
ఎంపీ కేశినేని

By

Published : Sep 18, 2022, 3:13 PM IST

MP Keshineni Nani: ఓ విజనరీ నాయకుడి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధిని తాను చేయలేని అసమర్థుడనని ఒప్పుకొనే జగన్ మూడు రాజధానులు అంటున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టడ కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు.

ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో రాజధాని రైతులకు సంఘీభావంగా ముస్లిం మైనార్టీలు.. విజయవాడ నుంచి భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కేశినేని నాని జెండా ఊపి ప్రారంభించారు. ఒకే రాజధానిని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయించాలని... విభజన చట్టం చెప్పిందని ఎంపీ గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని నాని తెలిపారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్... మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. రైతుల మహాపాదయాత్రకు.. కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు రైతులకు ఉందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details