'రమేష్ కుమార్ రాసిన లేఖను తెదేపాకు ఆపాదించడం నేరమే' - mp kanakamedala alligations on ycp
కేంద్ర హోంశాఖకు రమేశ్ కుమార్ రాసిన లేఖ విషయంలో...విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఎంపీ కనకమేడల అన్నారు.
రమేశ్ కుమార్ రాసిన లేఖను... ఫోర్జరీ చేశానంటూ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. అది అవాస్తవమని తెలిసినా డీజీపీకు ఫిర్యాదు ఇవ్వడం నేరమని అన్నారు. నా గౌరవం, ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఆరోపణలు చేస్తున్నారని.. ఈ విషయంపై రమేశ్‌కుమార్ ఫిర్యాదు చేయాలిగానీ విజయసాయిరెడ్డి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రమేశ్ కుమార్ రాసిన లేఖను తెదేపాకు ఆపాదించడం నేరమని అన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.