ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించలేదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. లోక్‌సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. సమస్య పరిష్కరించేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి సాధ్వి నీరంజన్ జ్యోతి.. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదన్న ఫిర్యాదులు ఏమైనా వస్తే విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయట్లేదు: ఎంపీ కనకమేడల - ఏపీలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయట్లేదు
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వట్లేదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఏంపీ కనకమేడల రవీంద్రకుమార్