ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి' - స్టీల్ ప్లాంట్​పై ఎంపీ అయోధ్యరామిరెడ్డి

స్టీల్‌ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైకాపా వ్యతిరేకిస్తోందని వైకాపా ఎంపీ అయోధ్యరామిరెడ్డి రాజ్యసభలో అన్నారు. కేంద్ర తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

By

Published : Mar 19, 2021, 9:01 PM IST

స్టీల్‌ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని ఎంపీ అయోధ్యరామిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై రాజ్యసభలో ప్రస్తావించిన ఆయన..పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైకాపా వ్యతిరేకిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయన్నారు. కేంద్రం చర్యలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మంచి పనితీరు కలిగిన సంస్థలను జాతీయ ఆస్తిగా పరిగణించి రక్షించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.ఇలాంటి సంస్థలు భవితరాలకు సంపద సృష్టించి, భద్రత కల్పిస్తాయన్నారు. పెట్టుబడి ఉపసంహరణ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు కీడు చేస్తుందని వెల్లడించారు. నష్టాల్లో ఉన్నవాటిని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించాలి ఎంపీ అయోధ్యరామిరెడ్డి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details