ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అరవింద్ - భాజపా ఎంపీ అరవింద్ పుట్టినరోజు

BJP MP Arvind భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అరవింద్
భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అరవింద్

By

Published : Aug 25, 2022, 5:27 PM IST

MP Arvind comments: తాము బలపడడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని తెలంగాణకు చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయాల్లో ఒకపార్టీ ఎదగడానికి మరో పార్టీని చీల్చటంలో తప్పులేదన్నారు. ఆయన తన జన్మదినం సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో పుట్టిన రోజు వేడుకలు జరపుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. మునుగోడులో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుదని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో తమ పార్టీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీలోనూ అధికారంలోకి వస్తామన్నారు.

విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఈడీ, సీబీఐలను భాజపా పావులుగా వాడుకుంటుందా ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అదేం లేదని సమాధానమిచ్చారు. భాజపా అధినాయకత్వం ఏం చెబితే తాము అది పాటిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలను భాజపా అమ్మటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్న మరో ప్రశ్నకు.. ప్రాంతీయ పార్టీలు చేసినవే తాము చేస్తున్నామని అరవింద్ బదులిచ్చారు.

భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అరవింద్

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details