ఈనెల 22న తన కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడని విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన కృష్ణకుమారి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గన్నవరం మండలం దావాజీగూడెంలో గుడివాడ కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు.
కోటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అతని మృతదేహంపై గాయాలు గుర్తించినట్లు తల్లి కృష్ణకుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాల గురించి కోడల్ని ప్రశ్నించిగా.. గుండెనొప్పితో బాత్రూంలో పడి చనిపోయాడని సమాధానం ఇచ్చింది. కొడుకు మరణం తర్వాత కోడలు, ఆమె బంధువులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకపోవటంపై అనుమానం వచ్చిన కృష్ణకుమారి.. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.