ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. అత్యవసరమైతే కుషాయిగూడ, కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో పోలీస్‌ చెక్‌పోస్టులను పోలీస్ బాస్‌ పరిశీలించారు.

ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ
ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ

By

Published : May 22, 2021, 7:06 PM IST

తెలంగాణలో ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ తర్వాతే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే పాస్‌లు ఉన్నవారే బయటకు రావాలని.. నకిలీ పాస్‌లతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే సరకు రవాణా వాహనాలకు అనుమతి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఏ పనైనా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యే చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉంటుందని చెప్పారు.

ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ

ఇదీ చదవండి:'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'

ABOUT THE AUTHOR

...view details