ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'యువతను ప్రోత్సహిస్తే మరింత మంది నీరజ్ చోప్రాలు అవుతారు'

నీరజ్ చోప్రా ఒలంపిక్స్​లో బంగారు పతకం సాధించడంపై ఆంధ్రప్రదేశ్​ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. సరైన ప్రొత్సాహం లభిస్తే భవిష్యత్ ఒలింపిక్స్ క్రీడల్లో.. మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే సత్తా మన యువతకి ఉందని వ్యాఖ్యానించింది.

By

Published : Aug 8, 2021, 4:30 PM IST

నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రా ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని సాధించడంపై ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గతంలో విజయవాడలో జరిగిన జాతీయ క్రీడల్లో నీరజ్ చోప్రా వహించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఒలింపిక్స్ లో స్వర్ణ చరిత్ర లిఖించేవరకూ ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడింది.

యువతను ప్రొత్సహిస్తే నీరజ్ చోప్రాలాంటి ఎంతో మంది క్రీడాకారులు మనదేశంలో ఎదుగుతారని రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆకుల హైమ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాలని అసోసియేషన్ టెక్నికల్ అఫీషియల్ ఎగ్జామినేషన్స్ కన్వీనర్ డాక్టర్ ఎస్ రాజు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details