లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తెలంగాణలో ఇంటర్ మూల్యాంకనం సజావుగా సాగేందుకు... కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా ఉండేందుకు మూల్యాంకన కేంద్రాలను భారీగా పెంచనున్నారు. దీనివల్ల ఒక్కో చోట గుమిగూడే అధ్యాపకుల సంఖ్య తగ్గుతుందని ఇంటర్‌బోర్డు ఆలోచన. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాలు పాత వాటికి అనుబంధంగా పనిచేస్తాయి. మే 3వ తేదీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి మూల్యాంకనాన్ని ప్రారంభించాలని భావిస్తున్న ఇంటర్‌బోర్డు... అందుకు తగ్గట్లు ప్రణాళిక సిద్ధం చేసింది. దాన్ని ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం తీసుకోనుంది.
తెలంగాణ: ఇంటర్ మూల్యాంకనానికి మరిన్ని కేంద్రాలు - తెలంగాణ ఇంటర్ వాల్యుయేషన్ వార్తలు
తెంలగాణలో ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి కేంద్రాలను పెంచారు. కరోనాతో వాయిదా పడిన మూల్యాంకనం లాక్‌డౌన్ తర్వాత ప్రారంభం కానుంది.
![తెలంగాణ: ఇంటర్ మూల్యాంకనానికి మరిన్ని కేంద్రాలు more centers for inter valuation in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6811883-931-6811883-1587022071427.jpg)
ఇంటర్ మూల్యాంకనానికి మరిన్ని కేంద్రాలు
కేంద్రం నుంచి మార్గదర్శకాలొస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మార్చి 20వ తేదీ నుంచి ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉంది. కరోనాను దృష్ట్యా అధ్యాపకులు విధులు బహిష్కరించారు. మార్చి 24 నుంచి లాక్‌డౌన్ అమలు కావడంతో జవాబుపత్రాలు దిద్దే ప్రక్రియ ఆగిపోయింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9.65 లక్షల మందికి సంబంధించి దాదాపు 50 లక్షల జవాబు పత్రాలున్నాయి.
ఇవీచూడండి:
మార్కెట్లో ఇవాళ్టి కూరగాయల ధరలు
Last Updated : Apr 18, 2020, 9:14 AM IST