విజయవాడ పరిధిలో పని చేస్తున్న శాంతారాం అనే ఎస్సై తల్లి మూడు రోజుల క్రితం విజయనగరంలో అనారోగ్యంతో మృతి చెందారు. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న శాంతారాం అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. సెలవు దొరికినా విజయనగరంకు వెళ్లాలంటే మూడు జిల్లాలు దాటుకుని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తన సోదరుడికే అంత్యక్రియల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కష్టమైన నేపథ్యంలో విధుల్లోనే నిమగ్నమయ్యారు. ఈ ఘటన పోలీసుల విధుల నిబద్ధతకు నిదర్శనంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా రెండు వారాల పాటు బయటకు రావద్దని ఈ సందర్బంగా పోలీసులు సూచిస్తున్నారు.
కన్నతల్లి మరణించినా.. విధుల్లోనే ఎస్ఐ
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కన్నవారి కడచూపులకు సైతం పలువురు దూరమవుతున్నారు. లాక్‌డౌన్ ఒకవైపు, అత్యవసర విధుల్లో ఉండి కొందరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఓ ఎస్ఐకి ఎదురైంది.
monther-die-but-si-on-duty-in-vijayawada