ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు - water problems of monkeys

ఎండలు మండుతున్నాయి.. గొంతు తడి ఆరుతోంది. దీంతో మనుషులకే కాదు జంతువులకు కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాజాగా అదే కోవలో శుక్రవారం కోతికి దాహం వేసింది. చుట్టుపక్కల నీరు దొరకలేదు. చేసేది ఏమీ లేక అక్కడే ఉన్న ఓ కుళాయి ద్వారా నీరు తాగి దాహం తీర్చుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని యాదాద్రిలో చోటుచేసుకుంది.

monkey water problems
మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు

By

Published : Mar 6, 2021, 3:28 AM IST

ఎండలు ముదురుతున్నాయ్​... తాగునీటి కోసం వెంపర్లాట మొదలైంది. ఒక్క పూట నీరు లేకుండా ఉండటం మనుషులకే కష్టం.. అలాంటింది ఇక జంతువుల పరిస్థితి ఏంటి. అలాంటి సంఘటనే శుక్రవారం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై జరిగింది. ఓ కుళాయి వద్ద కోతులు తమ దప్పికను తీర్చుకొనేందుకు నానా తంటాలు పడ్డాయి.

గతంలో ఆ క్షేత్ర పరిధిలో పలు చోట్ల నీటి తొట్టెల ఏర్పాటుతో... కోతులు, ఇతర జంతువులు, పక్షులు తమ దాహం తీర్చు కునేవి. కానీ క్షేత్రాభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం అవేవీ లేకుండా పోయాయి. దీంతో జంతువులు, పక్షులు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి ఆ మూగజీవాల సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి :డబ్బులిచ్చి ఏకగ్రీవాలు ఎందుకు చేసుకుంటున్నారో సీఎం చెప్పాలి: రామకృష్ణ

ABOUT THE AUTHOR

...view details