Mohanbabu Meet Chandrababu: ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. చాలా కాలం తర్వాత చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు రావడం హాట్ టాపిక్‌గా మారింది. తాజా రాజకీయాలపై ఇద్దరూ ఏం చర్చించుకున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు.. సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ - Mohanbabu Meet Chandrababu at Hyderabad
Mohanbabu Meet CBN:ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్‌బాబు.. తాజా రాజకీయాలపై దాదాపు గంటకుపైగా చర్చించుకున్నారు.
![చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు.. సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15932339-828-15932339-1658847345912.jpg)
చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు
రాజకీయ ప్రాముఖ్యత లేదు: ఇదిలా ఉండగా..చంద్రబాబును మోహన్ బాబు కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని తెదేపా స్పష్టం చేసింది. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ వద్ద సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉందని..,ఆ కార్యక్రమానికి చంద్రబాబును ఆయన ఆహ్వానించినట్లు తెలిపింది.
ఇవీ చూడండి
Last Updated : Jul 26, 2022, 9:48 PM IST